Man-lures-woman-with-dinner-and-rapes-her-

డిన్నర్ పేరుతో నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి..

దుబాయ్: నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి మహిళపై ఓ వ్యక్తి రెండుసార్లు లైంగికదాడి చేశాడు. దుబాయ్‌లో అల్ అయిన్ ప్రాంతంలో నివాసముంటున్న ఫిలిఫైన్స్‌కు చెందిన మహిళకు వాట్సాప్‌లో నెల రోజుల క్రితం ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అతడితో చాట్ చేస్తున్న సమయంలో డిన్నర్ రావాలంటూ ఆమెను ఆహ్వానించాడు. అతడిని ఆమె నమ్మింది. వెంటనే అతడి ప్రపోజల్‌కు ఓకే చెప్పింది. ఇద్దరు కలిసి రాత్రి డిన్నర్ చేసేందుకు రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడి నుంచి ఓ కెఫ్‌కు వెళ్లారు. తరువాత ఆమె నివాసం దగ్గర వదిలేస్తానని చెప్పి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆమెపై కారులోనే రెండుసార్లు లైంగికదాడి చేశాడు. ఆ విషయం ఎక్కడా చెప్పొద్దని బెదిరించి ఆమెను ఇంటి దగ్గర వదిలేశాడు. తన స్నేహితురాలి సాయంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ రోజు ఏం జరిగిందో ఫిర్యాదులో పేర్కొంది. తాను ఓ కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నానని ఆమె చెప్పింది. పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి తమ కంపెనీలో వేరే బ్రాంచీలో పనిచేస్తున్నాడని అతడితో వాట్సాప్‌లో పరిచయం ఏర్పడిందని చెబుతోంది. పరిచయమున్న వ్యక్తి కాదని డిన్నర్ చేద్దామంటే వెళ్లానని పేర్కొంది. ఇదిలావుండగా ఆ వ్యక్తి మాత్రం తాను ఆమెపై లైంగికదాడి చేయలేదన్నాడు. ఆమె తనను ముద్దు పెట్టుకుందని ఫోటోలు కూడా చూపించాడు. అయితే మార్ఫింగ్ చేసిన ఫోటోలని పోలీసులు తేల్చారు. ఫోరెన్సిక్ రిపోర్టులో కూడా ఆమెపై అతడు లైంగికదాడి చేసినట్లు తేలిందని పోలీసులు తెలిపారు.