man-kills-monstar-crocodile

మొసలిని చంపినందుకు విధించబోయే శిక్ష ఇది?

కాన్‌బెర్రా: వన్యప్రాణి సంరక్షణ జాబితాలో ఉన్న ఓ మొసలిని 31 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి అత్యంత దారుణంగా చంపేశాడు. ఆస్ట్రేలియాలోని ఫిట్జ్‌రో నదిలోని సుమారు 5.2 మీటర్ల పొడవున్న భారీ మొసలిని ల్యూక్ స్టెఫెన్ ఓచర్డ్ అనే వ్యక్తి తుపాకీతో కాల్చిచంపాడు. మొసలి నోరు, ఇతర శరీర భాగాలపై బుల్లెట్లు దిగిన తీవ్రమైన గాయాలు కనిపించాయి. 2017 సెప్టెంబర్‌లో ఈ ఘటన జరిగింది. మొసలిని చంపిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా అతడి ఇంటిని తనిఖీ చేయగా అనేక మారణాయుధాలు లభించాయి. ఈ కేసుపై కోర్టులో విచారణ జరుగుతోంది. అకారణంగా వణ్యప్రాణులను చంపిన నేరంపై నిందితుడికి 28,000(దాదాపు రూ. 18 లక్షలు) డాలర్ల జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయని, నేరం రుజువైన చెల్లించాల్సిందేనని పోలీసులు వెల్లడించారు.