Man-kills-compatriot-in-Dubai-after-stabbing-him-35-times

తన దేశస్థుడని కూడా ఆలోచించకుండా అంతమొందించాడు

దుబాయ్: యూఏఈలోని దుబాయ్ నగరంలో దారుణమైన ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇరాన్‌కు చెందిన 23 ఏళ్ల యవకుడు తన దేశానికే చెందిన వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఓ కత్తితో 35 సార్లు పొడిచిచంపాడు. అత్యంత దారుణమైన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఇరాన్ చెందిన చెందిన ఇద్దరు యువకులు దుబాయ్ నగరంలో నివాసముంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పథకం ప్రకారం యువకుడు తన తోటి వ్యక్తిని కిరాతకంగా అంతమొందించాడు. అనంతరం రక్తంతో తడిసిపోసిన చొక్కాతో పోలీసులకు లొంగిపోయాడు. తానే హత్య చేశానని చెప్పాడు. పథకం ప్రకారం హత్య చేశానని వివరించాడు. కేసుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అనంతరం దేశం నుంచి వెళ్లగొట్టాలని ఆదేశించింది. ఈ తీర్పుపై నిందితుడు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కానీ ఇదే శిక్షను అమలు చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ ఘటన మృతుని కుటుంబంలో తీవ్రవిషాదాన్ని నింపింది. ఎందుకు హత్య చేశాడో అర్థకావడం లేదని కన్నీళ్లతో చెబుతున్నారు. ఈ ఘటన యూఏఈలోని దుబాయ్ నగరంలో జరిగింది.