Man-jailed-for-twisting-Dubai-policemans-arm

పోలీసు చేతిని మెలిబెట్టాడు..ఎందుకంటే..

దుబాయ్: పలు దొంగతనాలకు పాల్పడి పట్టుబడిన ఓ దొంగ తనను అరెస్ట్ చేసిన పోలీసు అధికారికి షాకిచ్చాడు. అధికారి చేతిని గట్టిగా మెలిబెట్టాడు. పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింది కేసులు నమోదు చేశారు. ఈ కేసుపై కోర్టులో విచారణ జరిగింది. నిందితుడి నేరం రుజువు కావడంతో 3 నెలల జైలుశిక్ష విధించింది. దోషి ఈజిప్ట్‌కు చెందిన వ్యక్తి కావడంతో శిక్షకాలం ముగిసిన తర్వాత దేశం నుంచి పంపించివేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. అలాగే స్టేషన్ ఫర్నీచర్‌ను ధ్వంసం చేయడంతో జరిమానా చెల్లించాలని ఆదేశించారు. ఇదిలావుండగా దాడికి గురైన అధికారి చేయి నొప్పపట్టిందని, ఆయన కోలుకుంటున్నారని అధికారులు తెలిపారు. నిందితుడి వయసు 27 సంవత్సరాలన్నారు. నేరానికి పాల్పడిన వ్యక్తులను క్షమించబోమని, శిక్ష అనుభవించి తీరాల్సిందేనని అధికారులు తెలిపారు.