man-charged-with-sexually-harassing

లిఫ్ట్‌లో ఒంటరిగా ఉన్న మహిళను వేధించి..

దుబాయ్: లిఫ్ట్‌లో ఒంటరిగా కనిపించిన ఓ బ్రిటిష్ మహిళ పర్యాటకురాలిని భారత యువకుడు లైంగికంగా వేధించాడు. అతడు అదే పనిగా ఆమెను అసభ్యకరంగా తాకుతున్నాడు. లిఫ్ట్‌లో ఎవ్వరూ లేకపోవడంతో ఆమె మౌనంగా నిలబడిపోయింది. రెండో అంతస్తు నుంచి లిఫ్ట్‌ 37వ అంతస్తుకు వెళ్తోంది. యోగ ప్రాక్టీసు కోసం తాను లిఫ్ట్‌లో ఉదయమే బయలుదేరానని ఆ మహిళ తెలిపింది. తనను గమనించిన వ్యక్తి తన వెనకాలే లిఫ్ట్‌లోకి వచ్చాడని ఆమె చెబుతోంది. రాగానే తన ఎడమ పక్కన నిలబడి తనతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడంటోంది. అతడి నీచమైన ప్రవర్తనను భరించలేకపోయానంది. వెంటనే 34వ అంతస్తు వద్దే తాను లిఫ్ట్‌లో నుంచి బయటకు వచ్చానంది. హోటల్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అతడిని పట్టుకున్నారని ఆమె తెలిపింది. తర్వాత పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి అతడిని అరెస్ట్ చేశారని ఆమె తెలిపింది. అయితే లిఫ్ట్‌లో సీసీ కెమెరాలు లేకపోవడంతో వీడియో రికార్డ్ కాలేదు. కానీ, బాధితురాలు తన మొబైల్‌లో కొంత సమయం నిడివితో వీడియో తీసిందని పోలీసులు తెలిపారు.