:: Welcome to NRI - Article ::

"చైనాకు ఇది స్ట్రాంగ్ వార్నింగ్ అవుతుంది"

చెన్నై: అమెరికా, జపాన్, ఇండియా కలిసి సంయుక్తంగా మలబార్ నేవీ విన్యాసాలు చేస్తున్నాయి. బంగాళాఖాత తీరంలో ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నారు. అందులో అమెరికాకు చెందిన ఎఫ్/ఎ18 సూపర్ ఫైటర్ జెట్‌లు ప్రత్యేకఆకర్షణగా నిలిచాయి. 4.5 ఎకరాల విస్తీర్ణంలో 98వేల టన్నుల బరువున్న నిమిత్జ్ అనే ఎయిర్‌క్రాఫ్ట్ కారియర్ 100నాటికల్ మైళ్లు ప్రయాణించి బంగాళాఖాత తీరానికి చేరుకుంది. ఇదే ఇప్పుడు చైనా గుండెళ్లో గుబులు రేపుతోంది.

దక్షిణచైనా సముద్రంలో అమెరికాతో, చైనాకు విభేదాలు ఉన్నాయి. అటు జపాన్‌తోనూ జగడాలు, ఇటు ఇండియాతో సరిహద్దు వివాదాలు జరుగుతున్న నేపథ్యంలో మూడు దేశాలు తమ సైనిక, నావిక బలాలను ప్రదర్శించడంతో చైనా భయపడే అవకాశం ఉందని అమెరికా అడ్మిరల్ విలియమ్ బేర్న్ చెబుతున్నారు. మలబార్ విన్యాసాలకు మూలం చైనాకు చెక్ చెప్పడమేనని ఆయన అన్నారు. మూడు దేశాలు రక్షణ విషయంలో ఒకదానికొకటి పూర్తి సహకారం అందించుకుంటాయని ఆయన తెలిపారు. భారత్‌కు ఈ విన్యాసాలు నైతిక మద్దతు ఇచ్చినట్లుగా ఉందని డోక్లాం సరిహద్దు నుంచి చైనా వెనక్కు తగ్గే అవకాశం  ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

Loading...