maid-falls-to-death-from-19th-floor-in-Sharjah

19వ అంతస్తు నుంచి పడి మహిళ మృతి

షార్జా, యూఏఈ: ఇథియోపియా నుంచి వలస వెళ్లి యూఏఈలోని షార్జాలో పనిమనిషిగా ఉపాధి పొందుతున్న ఓ మహిళ ప్రమాదవశాత్తూ మృతి చెందింది. అల్ క్వాస్బా ప్రాంతంలోని ఎత్తైన ఓ భవనం 19 అంతస్తు నుంచి కిందపడి అక్కడికక్కడే చనిపోయింది. రక్తపు మడుగులో పడివున్న ఆమెను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. హుటిహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు మహిళ చనిపోయిందని నిర్ధారించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కిచెన్‌ను శుభ్రం చేస్తూ కిటీకి నుంచి పనిమనిషి ప్రమాదవశాత్తూ జారీపడిందని యజమానులు చెబుతున్నారు. అయితే ఈ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న పోలీసులు కారణాలను తెలుసుకునేందుకు మృతదేహాన్ని ఫొరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని అధికారులు వెల్లడించారు. ఈ కేసుపై విచారణ కొనసాగుతుందని తెలిపారు.