longest-nails-in-the-world-

అతి పొడవైన గోళ్లను పెంచిన వ్యక్తిగా...

న్యూయార్క్: గోళ్లు పెంచుకోవడం చాలా మందికి సరదా. అయితే శ్రీధర్ చిల్లాల్ మాదిరిగా గోళ్లు పెంచిన వ్యక్తిని మాత్రం ఇంతవరకు చూసి ఉండరు. ఎందుకంటే శ్రీధర్ దాదాపు 66 ఏళ్ల నుంచి గోళ్లు పెంచుతున్నాడు. 1952 నుంచి శ్రీధర్ తన ఎడమచేతి గోళ్లను కత్తిరించలేదు.

దాంతో ప్రపంచంలోనే అతి పొడవైన గోళ్లు పెంచిన వ్యక్తిగా శ్రీధర్ గిన్నిస్ రికార్డు సృష్టించాడు. అయితే శ్రీధర్ గోళ్లను గిన్నిస్ బుక్ ప్రతినిధులు న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో కత్తిరించారు. తరువాత కత్తిరించిన గోళ్లను మ్యూజియమ్‌లో ఉంచనున్నామని గిన్నిస్ బుక్ ప్రతినిధులు తెలిపారు. పుణేకు చెందిన శ్రీధర్ గిన్నిస్ రికార్డుసానందంగా ఉందని పలువురు ఎన్నారైలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.