:: Welcome to NRI - Article ::

యూనిఫాంలో ఓ పోలీసు నిర్వాకానికి ప్రభుత్వ శిక్ష ఇది

మనామా: గల్ఫ్‌దేశం కువైట్‌లో నేరం చేస్తే శిక్షలు కఠినంగా ఉంటాయి. నేరాలకు శిక్షను అమలు చేసే పోలీసు అధికారులు చాలా నిబద్ధతో, పారదర్శకంగా చట్టాలను అమలు చేస్తారు. కానీ ఓ పోలీసు అధికారి నిబంధనలను తుంగలో తొక్కాడు. తప్పు చేస్తూ అడ్డంగా దొరికాడు. మనామా ప్రాంతంలో యూనిఫాంలో ఉన్న ఓ పోలీసు అధికారి ఓ రెస్టారెంటులో కూర్చుని హుక్కా చేస్తూ కనిపించాడు. ఈ దృశ్యాన్ని ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌తో ఫోటో తీశాడు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చివరకు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రి వరకూ చేరింది. దీంతో యూనిఫాం ధరించి బహిరంగంగా ధూమపానం చేసిన పోలీసు అధికారికి 20 రోజుల జైలు శిక్ష విధించాలని ఆదేేశించారు. దీంతో తప్పు చేసిన వారిని శిక్షించాల్సిన తానే తప్పు చేయడంతో నిందిత పోలీసు అధికారి శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ ఘటనతో తప్పు చేసిన ఎవరైనా చట్టం ముందే సమానమే అనే భావాన్ని ప్రజలకు కల్పించడంతోపాటు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వారికి శిక్షలు తప్పవని హెచ్చరికలు పంపించారు. పోలీసు అధికారి 20 రోజుల జైలు శిక్షను అనుభవిస్తున్నాడని అధికారులు తెలిపారు.

 

Loading...