Kuwait-Joins-Iraq-Reconstruction-Drive

భారీ సహాయం ప్రకటించిన కువైట్

కువైట్: ఇస్లామిక్ ఉగ్రవాదుల రాక్షసత్వానికి చిన్నాభిన్నమైన ఇరాక్ పునర్మిణానికి కువైట్ కూడా తోడైంది. తనవంతు భారీ సహాయాన్ని ప్రకటించింది. ఇరాక్ ఆర్థిక వ్యవస్థ పురోగభివృద్ధి, మౌలిక సదుపాయల కల్పనకు కృషి చేస్తామని హామి ఇచ్చింది. 2 బిలియన్ల డాలర్లు( రూ.12 వేల 846 కోట్లకుపైగా) అందించనున్నామని కువైట్ ఎమిర్ షేక్ సబహ్ అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ సబహ్ ప్రకటించారు. ఇరాక్ పునర్మిణామంపై కువైట్‌లో జరిగిన వ్యాపావేత్తలు, పెట్టుబడిదారులు సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ ప్రకటన చేశారు. 1 బిలియన్ డాలర్ల నేరుగా అందించనుండగా మరో బిలియన్ డాలర్లను పెట్టుబడుల రూపంలో అందించనున్నామని అన్నారు. ఇదిలావుండగా ఇరాక్ భూభాగంలో మూడొంతులను ఆక్రమించిన ఉగ్రవాదులు వినాశనాన్ని సృష్టించారు. భద్రతాదళాలు, ముష్కరులకు మూడేళ్లపాటు జరిగిన పోరాటంలో అనేక ఇళ్లు, భవనాలు, ప్రభుత్వ సముదాయాలు నేలమట్టమయ్యాయి. ఉగ్రవాదులపై పైచేయి సాధించిన అనంతరం ఇరాక్ పునర్నిణానికి తగు చర్యలు తీసుకునే క్రమంలో కీలకమైన చర్చలు జరుగుతున్నాయి. భారీగా నిధులు సహాయం చేసేందుకు పలు స్వచ్ఛంగా సేవా సంస్థలు ముందుకొస్తున్నాయి. అమెరికా కూడా తనవంతు సహకారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.