Kim-impressed-with-Trump-car

ట్రంప్‌ కారును చూసి ముచ్చటపడ్డ కిమ్‌

కిమ్‌ జోంగ్‌ ఉన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన లిమోజీన్‌ కారు ‘ద బీస్ట్‌’ను చూపించారు. దాని ప్రత్యేకతలను వివరించారు. సదస్సు ముగిసిన తర్వాత కిమ్‌, ట్రంప్‌లు హోటల్‌ ప్రాంగణంలో అటూ ఇటూ తిరిగారు. ఈ సందర్భంగా, అమెరికా అధ్యక్షుడి లీమోజీన్‌ కారును ట్రంప్‌ కిమ్‌కు చూపించారు. రూ.10 కోట్ల విలువైన 8 టన్నుల బుల్లెట్‌ ప్రూఫ్‌ కారులోకి వెళ్లి కిమ్‌ పరిశీలించారు. కారు విశేషాలు చెబుతుంటే కిమ్‌ నవ్వుతూ నిలుచున్నారు.