Khalifa-orders-release-of-935-prisoners

రంజాన్ సందర్భంగా శుభవార్త

అబుదాబి: పవిత్ర మాసం రంజాన్ సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయేద్ అల్ నహ్యాన్ శుభవార్త చెప్పారు. వివిధ నేరాలకు పాల్పడి జైళ్లలో మగ్గుతున్న 935 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తున్నామని ప్రకటించారు. సోమవారం ఈ ప్రకటన విడుదల చేశారు. కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి, కుటుంబ బాధ్యతలను మోసేందుకు నేరాలకు పాల్పడినవారికి ఇదో చక్కని అవకాశమని అధికారులు పేర్కొన్నారు. పవిత్ర మాసం రంజాన్ సందర్భంగా అధ్యక్షుడు ఈ ఆదేశాలు జారీ చేశారని, అర్హత కలిగిన ఖైదీలను విడిచి పెట్టనున్నామని అధికారులు సోమవారం వెల్లడించారు. దీంతో క్షమాభిక్ష లభించనున్న ఖైదీలు, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశాధ్యక్షుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.