:: Welcome to NRI - Article ::

చైనా సంచలన ప్రకటన..

వాషింగ్టన్: చైనా ప్రకటనపై అమెరికా సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇంతకీ చైనా ఏమని ప్రకటన చేసిందంటే ఉత్తరకొరియాతో లావాదేవీలు జరపొద్దంటూ చైనా సెంట్రల్ బ్యాంకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన బ్యాంకు శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ఐక్యరాజ్యసమితి అంక్షలను చైనా తప్పకుండా పాటిస్తుందని తెలిపింది. చైనా అధికార మీడియాలోనే సెంట్రల్ బ్యాంకు ఉత్తరకొరియాతో ఆర్థిక కార్యకాలపాలను నిలిపేయాలంటూ వార్తను ప్రచురించింది.

సెప్టెంబర్3న ఉత్తరకొరియా జరిపిన బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగంతో చైనా కూడా ఉత్తరకొరియాపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. చైనా అత్యంత దగ్గరగానే బాలిస్టిక్ మిస్సైల్ ప్రయాణించిందని దాంతో చైనా ప్రజలకు కూడా ఉత్తరకొరియా ముప్పు ఉంటుందనే భయంతోనే చైనా ఐక్యరాజ్యసమితి అంక్షల అమలు పేరుతో ఉత్తరకొరియాను కట్టడి చేయాలనుకుంటుందని అమెరికా మీడియా విశ్లేషించింది.