:: Welcome to NRI - Article ::

లండన్‌లో ఘనంగా కేసీఆర్ 63 జన్మదిన వేడుకలు

లండన్: ఎన్నారై టీఆర్‌ఎస్ యుకే శాఖ ఆధ్వర్యంలో లండన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్నారై టీఆర్‌ఎస్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, ఆయన సతీమణి ప్రభలత కూర్మాచలం సంప్రదాయబద్దంగా కార్యక్రమాన్ని ముందుండి నిర్వహించారు. 

 
లండన్ ఇంచార్జి సతీష్ రెడ్డి బండ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో కేసీఆర్ 63వ పుట్టినరోజు సందర్భంగా వివిధ ప్రదేశాల నుంచి సేకరించిన 63 రకాల పువ్వులతో వెస్ట్ లండన్‌లోని ప్రసిద్ధ దుర్గాదేవి అమ్మ వారి ఆలయంలోని కార్యవర్గ సభ్యులు కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్లప్పుడూ ఆరోగ్యాంగా ఉండాలని, తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా నిర్మించే క్రమంలో కేసీఆర్‌కి భగవంతుడు అన్ని సందర్భాల్లో మనోధైర్యం, ఆశీస్సులు అందించి ముందుకు నడిపించాలని కోరుకున్నామని కార్యవర్గ సభ్యులు తెలిపారు. 
 
ఆలయ పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్ ఎక్కడున్నా నిండునూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, అలాగే తెలంగాణ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని దీవించారు. నాయకుడు కేసీఆర్, మాతృభూమిపై కార్యవర్గ సభ్యుల ప్రేమను చూసిన పండితులు హర్షం వ్యక్తం చేశారు.  ఇప్పటివరకు అమ్మవారికి ఒకేసారి 63 రకాల పూలతో పూజ చేయడం ఇదే మొదటిసారని, వీరి ఆలోచనను అభినందించి సభ్యులందరినీ ఆశీర్వదించారు. పూజ అనంతరం ఏర్పాటు చేసిన వేడుకల్లో కేక్ కట్ చేసి కేసీఆర్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా లండన్‌లో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు జరుపుతున్నామని, కానీ ఈ సంవత్సరం ప్రత్యేక పూజలు చేసి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని సభ్యులు తెలిపారు.
 
లండన్‌లో వేడుకలే కాకుండా ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఈ సంవత్సరం కూడా వరంగల్‌లో రక్త దాన శిబిరం ఏర్పాటు చేశామని కార్యదర్శి సృజన్ రెడ్డి చాడ తెలిపారు. చివరిగా లండన్ ఇంచార్జ్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. ఒక రోజంతా ఇలా వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని, బంగారు తెలంగాణ నిర్మాణంలో కేసీఆర్ వెంటే ఉంటామని అన్నారు. హాజరైన కార్యవర్గ సభ్యులందరికి ప్రత్యేకంగా పూల సేకరణకు కృషి చేసిన అశోక్ దూసరి, రత్నాకర్ కడుదులకు కృతఙ్ఞతలు తెలిపారు.
 
ఈ వేడుకల్లో ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, ఉపాధ్యక్షుడు అశోక్ దూసరి, నవీన్ రెడ్డి, శ్రీకాంత్ పెద్దిరాజు, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, అడ్వైసర్ బోర్డు సభ్యులు దొంతుల వెంకట్ రెడ్డి, సత్యం రెడ్డి కంది, సెక్రటరీ సృజన్ రెడ్డి, మీడియా ఇంచార్జ్ శ్రీకాంత్ జెల్ల, యూకే & ఈయూ ఇంచార్జ్ విక్రమ్ రెడ్డి, ఐటీ సెక్రటరీ వినయ్ ఆకుల, లండన్ ఇంచార్జ్ సతీష్ రెడ్డి బండ, ఈస్ట్ లండన్-కో ఆర్డినేటర్ రమేష్ యెసంపల్లి, నవీన్ మాదిరెడ్డి, ఈవెంట్స్-కో ఆర్డినేటర్స్ రవి ప్రదీప్, వెస్ట్ లండన్ ఇంచార్జ్ గణేష్ పాస్తం, సురేష్ బుడగం, మెంబర్ షిప్ ఇంచార్జ్ రాకేష్ రెడ్డి కీసర, ముఖ్య సభ్యులు రవి కుమార్ రత్తినేని, అశోక్ కుమార్ అంతగిరి, టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది, టాక్ సభ్యులు స్వాతి బుడగం, మట్టా రెడ్డి, శ్రీనివాస్ యాదవ్ మేకల తదితరులు హాజరైన వారిలో ఉన్నారు.