:: Welcome to NRI - Article ::

బహ్రెయిన్‌లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి 17.02.17: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 63వ జన్మదినాన్ని బహ్రెయిన్‌లోని తెలంగాణ జాగృతి సభ్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదానం, ఆరోగ్య శిబిరాలను నిర్వహించారు. సల్మానీయా ప్రభుత్వ మెడికల్ కాంప్లెక్స్‌లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అనంతరం ఓ లేబర్ క్యాంపులో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించి వందలాది మంది తెలంగాణ కార్మికులకు ఆరోగ్య పరిక్షలు నిర్వహించారు. అంతకు ముందు తెలంగాణ జాగృతి అధ్యక్షుడు సీహెచ్. హరిప్రసాద్ స్ధానిక కృష్ణమందిరంలో కేసీఆర్‌ పేరుపై ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం కేసీఆర్‌ను తెలంగాణ జాతిపీతగా ఆయన అభివర్ణించారు.