:: Welcome to NRI - Article ::

చలమేశ్వర్‌కు ‘తానా’ సత్కారం

అమరావతి, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): అమెరికాలో పర్యటిస్తున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ను ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) సత్కరించింది. అమెరికా సుప్రీం కోర్టును సందర్శించేందుకు ఆయన వాషింగ్టన్‌ డీసీ వచ్చిన సందర్భంగా తానా ప్రతినిధులు ఈ సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఇదే కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌, మేరీల్యాండ్‌ రాష్ట్ర ప్రతినిధి అరుణా మిల్లర్‌ పాల్గొన్నారు. తానా నేతలు వేమన సతీష్‌, కాట్రగడ్డ కృష్ణప్రసాద్‌, చల్లా ససల తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.