:: Welcome to NRI - Article ::

‘నిజాలు మాట్లాడండి డొనాల్డ్ ట్రంప్‌’

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్(92).. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, ఆయన విధానాన్ని విమర్శించారు. పద్ధతి మార్చుకోవాలంటూ ట్రంప్‌కు హితోపదేశం పలికారు. అట్లాంటాలోని పోస్ట్ ప్రెసిడెన్సీ కార్టర్ సెంటర్‌లో ఆయన మద్ధతుదారులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వేదికపై మాట్లాడుతూ... రాజకీయాలలో డబ్బు ప్రభావం ఉండకూదన్నారు. డబ్బు వల్ల ప్రజాస్వామ్యం కాస్తా అల్పజనాధిపత్యంగా మారుతోందని వ్యాఖ్యానించారు. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అంతర్జాతీయ వేదికలపై అమెరికాకు తీవ్ర నిరాశను మిగుల్చుతున్నారని కార్టర్ అన్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌కు సలహాలు ఇచ్చారు. దేశంలో శాంతిని నెలకొల్పాలని, మానవహక్కులను ప్రచారం చేయాలని, నిజాలు మాట్లాడాలంటూ  ట్రంప్‌కు సూచించారు. కానీ 2016లో జరిగిన ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో రష్యా వేలు పెట్టిందనే ఆరోపణలపై ఆయన స్పందించలేదు. ఇదిలావుండగా జిమ్మీ కార్టర్ అమెరికాకు 39వ అధ్యక్షునిగా పని చేశారు.