jet-airways-offer

తక్కువ ధరకే జెట్‌ ఎయిర్‌వేస్‌ టికెట్లు

న్యూఢిల్లీ: తక్కువ ధరకే విమాన టికెట్లను అందించే ఆఫర్‌ను జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రారంభించింది. ఇందులో భాగంగా దేశీయ, విదేశీ టికెట్ల ప్రామాణిక ధరను 30 శాతం వరకు తగ్గిస్తున్నట్టు తెలిపింది. ఈ ఆఫర్‌ బుధవారం (5వ తేదీ) నాడే ప్రారంభమైంది. 11వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ ఆఫర్‌ కింద టికెట్లను బుక్‌ చేసుకున్న వారు 5వ తేదీ నుంచే ప్రయాణించే అవకాశం కల్పించింది జెట్‌ ఎయిర్‌వేస్‌. వచ్చే ఏడాది సెప్టెంబరు 30వ తేదీలోపు డిస్కౌంట్‌ ధరలకు టికెట్లు కొన్న వారు ప్రయాణించవచ్చు.