:: Welcome to NRI - Article ::

'మా పూర్తి మద్దతు అమెరికాకే'

వాషింగ్టన్: ఉత్తరకొరియా న్యూక్లియర్ మిస్సైల్ టెస్ట్‌ల వల్ల ప్రపంచ దేశాలకు భయం కలుగుతోందని ఎప్పుడు ఏం జరుగుతోదనని జపాన్ ప్రజలు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారని జపాన్ ప్రభుత్వ సలహదారు తాంగూచి ఆవేదన వ్యక్తం చేశారు.  ఉత్తరకొరియా న్యూక్లియర్ మిస్సైల్ ప్రయోగాలు జరపకుండా కట్టడి చేయడంలో అమెరికా కొంతవరకు విజయం సాధించినట్టేనని ఆయన స్పష్టం చేశారు. ఉత్తరకొరియా ఆర్థిక మూలాలను దెబ్బకొట్టి న్యూక్లియర్ మిస్సైల్ ప్రయోగాలకు ఆ దేశాన్ని దూరం చేసిందని తాంగూచి అన్నారు. ఉత్తరకొరియాను కట్టడికి తాము అమెరికాకు పూర్తిగా సహకారం అందిస్తామని ఆయన ప్రకటించారు.

అయితే ఉత్తరకొరియా మరోసారి న్యూక్లియర్ మిస్సైల్ ప్రయోగాలకు సిద్ధమవుతోందన్న వార్తలు జపాన్ ప్రజలకు కలవరం కలిగిస్తున్నాయని ఆయన అన్నారు. మళ్లీ ఉత్తరకొరియా న్యూక్లియర్ మిస్సైల్ ప్రయోగాలు జరిపితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొబోతోందని ఆయన హెచ్చరిస్తున్నారు. అమెరికా ఇప్పటికే ఉత్తరకొరియాపై దాడికి అన్ని రకాలుగా సిద్ధమవుతోందని స్పష్టం చేశారు. జపాన్ సైన్యం కూడా అమెరికాకు సాయమందిస్తుందన్నారు.