:: Welcome to NRI - Article ::

‘10 మంది ఉరిశిక్షలను పరిశీలించండి’

దుబాయ్: ప్రవాసభారతీయుల కష్టాలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే సామాజికి కార్యకర్త, దుబాయ్‌లో నివాసం ఉంటున్న ప్రవాసభారతీయుడు జనగాం శ్రీనివాసు మరోసారి తన సేవాభావ దృక్పథాన్ని చాటుకున్నారు. బెంగుళూరులో ఈ నెల 8న జరిగిన ప్రవాస భారతీయ దినోత్సవం కార్యక్రమంలో కేంద్రమంత్రి వీకే.సింగ్‌ని ఆయన కలిశారు. విదేశాల్లో 10 మంది భారతీయులకు విధించిన ఉరి శిక్ష విషయాన్ని మంత్రి దృష్టికి ఆయన తీసుకెళ్లారు. ఈ విషయాన్ని పరిశీలించాలని ఆయన కోరారు. సౌదీలో భారతీయులు ఎదుర్కుంటున్న సమస్యలను మంత్రికి ఆయన వివరించారు.