James-said-as-like-this-

'అధ్యక్షుడిగా ఆయన అనర్హుడే'

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ అనర్హుడని మీరు భావిస్తున్నారా? అని ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ జెమ్స్ కోమెను విలేకరి ప్రశ్నించాడు. అధ్యక్షుడిగా ట్రంప్ పనికిరాడన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని జెమ్స్ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఏబీసి అనే చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఇటీవల ట్రంప్ మానసిక స్థితిపై వస్తున్న అనుమానాల గురించి కూడా జెమ్స్ వివరించారు. ట్రంప్ పూర్తి ఆరోగ్యవంతుడన్నారు. ఆరోగ్యపరంగా ఎటువంటి లోపం ట్రంప్‌లో తాను గమనించలేదని ఆయన తెలిపారు. అలాగే ట్రంప్ నైతిక విలువలు కలిగిన మనిషి కాదని జెమ్స్ చెప్పారు.

మహిళల పట్ల ఆయన నీచ దృష్టి కలిగి ఉన్నారన్నారు. ట్రంప్ దృష్టిలో మహిళలంటే కేవలం రక్తమాంసాలున్న వారు మాత్రమేనన్నారు. మహిళల మనసును ట్రంప్ అర్థం చేసుకోలేరని జెమ్స్ చెప్పారు. అయితే ట్రంప్‌ను ప్రజలు తిరస్కరించే ప్రమాదం మాత్రం ఉండబోదని జెమ్స్ మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ట్రంప్ పాలనపరంగా పెద్దగా మార్పులేమి తేలేకపోయారని జెమ్స్ అభిప్రాయపడ్డారు. అలాగే జెమ్స్ ఇటీవల రాసిన 'ఏ హైయ్యర్ లాయలిటీ' పుస్తకాన్ని ఆవిష్కరించారు.