It-can-cost-Rs.16-Lakh

విమానమెక్కాలంటే.. అక్షరాలా రూ.16లక్షలు..

దుబాయ్: పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఇత్తెహద్ ఎయిర్‌వేస్ కొత్త విమాన సర్వీసును ప్రారంభించబోతోంది. ఈ యేడాది జూలై1వ తేదీ నుంచి ఈ సర్వీసు అందుబాటులోకి వస్తుందని ఎయిర్‌వేస్ ప్రతినిధులు తెలిపారు. దక్షిణకొరియా రాజధాని సియోల్‌, అబుదాబిల మధ్య ఈ విమాన సర్వీసు నడుస్తుందని వారు చెప్పారు. దుబాయ్ పర్యాటకుల్లో దక్షిణకొరియా పర్యాటకుల వాటా ఎక్కువగా ఉంటుందన్నారు. అందుకే వారి కోసం ప్రత్యేకంగా విమాన సర్వీసును నడుపుతున్నామన్నారు. ఈ విమానంలో ప్రయాణించే ప్రీమియం ప్రయాణికులకు అకామిడేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నామని వారు తెలిపారు. ఒక బెడ్‌రూమ్, షవర్, లాంజ్‌లతోపాటు ఒక సహాయకుడిని కూడా ఏర్పాటుచేస్తున్నామన్నారు. అయితే ప్రీమియం ప్రయాణికులకు ప్రత్యేకమన్నారు. అక్కడికి ఎవ్వరినీ అనుమతించబోమన్నారు. మొత్తం ముగ్గురు వ్యక్తులు మాత్రమే అకామిడేషన్‌లో ఉండాలని షరతు విధించారు. అయితే ఈ విమానమెక్కాలంటే టిక్కెట్ ధర 85,000 దిర్హమ్స్(రూ.16,37,919)గా నిర్ణయించారు.