:: Welcome to NRI - Article ::

యూపీ సీఎంగా యోగి.. ట్రంప్ ట్వీట్ చేశారట..!

న్యూఢిల్లీ:  ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఎంత సంచలనం సృష్టించిందో.. సీఎం అభ్యర్థిగా యోగి ఆదిత్యనాథ్ ఎంపిక కూడా అంతే చర్చనీయాంశమయింది. పక్కా హిందుత్వవాది అని పేరుండటంతోపాటు ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో కనిపించారు యోగి ఆదిత్యనాథ్. గోరఖ్‌నాథ్ మఠానికి ప్రధాన పీఠాధిపతిగా ఉన్న యోగి... యూపీ సీఎంగా ప్రమాణం చేసి భారత్‌లోని అతిపెద్ద రాష్ట్రానికి పాలకుడయ్యారు. ఈ నేపథ్యంలో యోగిపై సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది. కొందరు నెటిజన్లు అయితే తమ సృజనాత్మకతను రంగరించి ఏకంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. యోగి ఎన్నికపై స్పందించినట్లు ట్వీట్లు రూపొందించారు. తాను అమెరికా ఎన్నికల్లో గెలవడం ఎలా జరిగిందో.. యూపీలో కూడా యోగి ఆదిత్యనాథ్ దుమ్ముదులిపేశారంటూ ట్రంప్ కొనియాడినట్లు అమెరికా అధ్యక్ష ట్విటర్ ఖాతా నుంచి ఓ ట్వీట్ పెట్టినట్లు నెటిజన్లు సృష్టించారు. అంతేకాకుండా యోగికి అభినందనలు తెలిపినట్లుగా కూడా ట్వీట్‌ను ఫోటోషాప్ చేశారు. మొత్తానికి ఇవన్నీ నిజం కాకపోయినా... కొందరు తెలియక వాటిని తెగ షేర్ చేసుకుంటున్నారు. 

 

Loading...