:: Welcome to NRI - Article ::

రష్యా చేతిలో ట్రంప్ ‘శృంగార వీడియోలు’..!

వాషింగ్టన్: మెరికా రాజకీయాలు దిగజారిపోయాయనడానికి ఇంతకంటే నిదర్శనం వేరొకటి లేదు. అమెరికా ప్రెసిడెంట్‌గా గెలుపొందిన ట్రంప్.. మరో తొమ్మిది రోజుల్లో అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్న తరుణంలో అమెరికా మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. 2013వ సంవత్సరంలో ట్రంప్.. రష్యా రాజధాని మాస్కో వెళ్లినప్పుడు ఓ లగ్జరీ హోటల్లో బసచేశారనీ, ఆ సమయంలో కొందరు వేశ్యలతో ఆయన గడిపారని అమెరికాలోని ప్రముఖ పత్రికలు ప్రత్యేక కథనాలను ప్రచురించాయి. వేశ్యలతో ట్రంప్ గడిపిన శృంగార వీడియోలు ప్రస్తుతం రష్యా చేతిలో ఉన్నాయనీ, అవి అమెరికా ప్రయోజనాలకు భంగం కలిగించే అవకాశం ఉందని కథనం సారాంశం. ఆ వీడియోలను అడ్డంపెట్టుకుని ప్రెసిడెంట్ అయిన తర్వాత ట్రంప్‌ను బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాలు ఒబామాకు, ట్రంప్‌కు ప్రత్యేక నివేదిక ఇచ్చినట్లు కూడా కథనంలో పేర్కొన్నారు. వీడియోల విషయం తెలిసే.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ట్రంప్ అవ్యాజమైన ప్రేమను కురిపిస్తున్నారని నిఘావర్గాలు నివేదికలో పొందుపరిచాయట. అయతే ఈ విషయాన్ని ట్రంప్ కొట్టిపారేశారు. ఇలాంటి పనులను తన వ్యతిరేకులు మానుకోవాలని సూచించారు. మీడియా కూడా ఇలాంటి చిల్లర వార్తలను ప్రచారం చేయడం తగదన్నారు.