:: Welcome to NRI - Article ::

ఆ రెండు దేశాలు యుద్ధాన్నే కోరుకుంటున్నాయి: ట్రంప్

వాషింగ్టన్: 'తమ దేశం తప్పకుండా న్యూక్లియర్ మిస్సైల్స్ ప్రయోగాలు జరిపి తీరుతుంది. అడ్డుచెప్పడానికి అమెరికాకు ఏ హక్కు లేదని' ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ హదామి ఘాటుగానే హెచ్చరించారు. అమెరికా వద్ద అత్యంత ఆధునాతన అణుక్షిపణులను పెట్టుకుని ఇరాన్‌ను ఆడిపోసుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. దేశ రక్షణ చర్యల్లో భాగంగానే తాము న్యూక్లియర్ మిస్సైల్ ప్రయోగాలు జరుపతున్నామని హదామి స్పష్టం చేశారు. మరిన్ని న్యూక్లియర్ పరీక్షలు జరిపేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నామని ఆయన చెప్పారు. అమెరికా హెచ్చరికలను తాము ఖతారు చేయబోమని ఆయన తెలిపారు.

అయితే ట్రంప్ కూడా ఇరాన్ న్యూక్లియర్ మిస్సైల్ ప్రయోగాలపై ట్వీట్టర్‌లో స్పందించారు. అమెరికా హెచ్చరికలను ఇరాన్ లెక్కచేయబోదని తాము ఊహించామన్నారు. ఉత్తరకొరియాలాగే ఇరాన్ కూడా తన సమాధిని తానే తవ్వుకుంటోందని ట్రంప్ హెచ్చరించారు. 2015లోనే ఇరాన్ న్యూక్లియర్ ప్రయోగాలపై ఐక్యరాజ్యసమితి అంక్షలు విధించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. న్యూక్లియర్ ప్రయోగాలు ఆపకపోతే 2025 వరకు కూడా అవే అంక్షలు కొనసాగుతాయని ట్రంప్ పేర్కొన్నారు. ఫ్రాన్స్, ఇజ్రాయెల్, సౌదీఅరేబియాలు కూడా ఇరాన్ న్యూక్లియర్ మిస్సైల్ ప్రయోగాలపై అభ్యంతరం వ్యక్తం చేశాయి.

అమెరికా, యూరప్ దేశాలు ఇరాన్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆ దేశాలు కోరుతున్నాయి. ఇరాన్, ఉత్తరకొరియాలు రెండు యుద్ధాన్ని కోరుకుంటున్నాయని అందుకే ఎవ్వరిని లెక్క చేయడం లేదని ట్రంప్ అసహసనం వ్యక్తం చేస్తున్నారు. ఆ రెండు దేశాలు అదే కోరుకుంటే అమెరికా అందుకు సిద్ధంగానే ఉందంటూ ట్రంప్ హెచ్చరిస్తున్నారు.