infosy-concern-over-visa-reject

వీసాల తిరస్కరణపై ఇన్ఫోసిస్‌ ఆందోళన

న్యూఢిల్లీ: పెరిగిపోతున్న వీసాల తిరస్కరణపై దేశీయ ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్‌ ఆందోళన వ్యక్తం చేసంది. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే విదేశాల్లో చేపడుతున్న ఐటి ప్రాజెక్టులు ఆలస్యం కావడంతో పాటు వాటి ఖర్చులు పెరిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఇటీవల భారత ఐటి నిపుణులకు సంబంధించిన వర్క్‌ వీసాల అప్లికేషన్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ తిరస్కరిస్తున్నాయి. దీంతో ఇన్ఫోసి్‌సతో పాటు, అనేక భారత ఐటి కంపెనీలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్య నుంచి బయట పడేందుకు ఇప్పటికే కొన్ని కంపెనీలు ఆయా దేశాల్లో స్థానికులను నియమించుకునేందుకు చర్యలు చేపట్టాయి. అయితే కొన్ని చోట్ల అవసరమైన నిపుణులు దొరకడం సమస్యగా మారింది. దీంతో సిబ్బది కొరతతో పాటు, ఆ ప్రాజెక్టుల ఖర్చులు పెరిగిపోయే ప్రమాదం ఉందని ఇన్ఫోసిస్‌ హెచ్చరించింది.