Infected-meat-have-entered

నిషేధిత మాంసం దేశంలోకి అనుమతించారని..

కువైట్: బ్రెజిల్‌లో అనారోగ్యం బారీన పడిన పశువులను చంపి, వాటి మాంసాన్ని తమ దేశానికి ఎగుమతి చేశారని కువైట్ అధికారులు ఆరోపిస్తున్నారు. అటువంటి మాంసాన్ని గుర్తించి దేశంలో రాకుండా సరిహద్దులోనే వెనక్కి పంపేశారు. ఆ మాంసంపై నిషేధం కూడా విధించారు. అయితే అదే మాంసం కొన్ని రెస్టారెంట్లలో వండుతున్నారని అధికారులకు సమాచారం అందింది. తాము వెనక్కి పంపిన మాంసం మళ్లీ దేశంలోకి ఎలా వచ్చిందని ఆరా తీశారు. దాని వెనకల ముగ్గురు అధికారుల హస్తం ఉందని గుర్తించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడేందుకు సిద్ధమైన అధికారులను పోలీసులు అరెస్ట్ చేశారు. 13 టన్నుల నిషేధిత మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.