indirect-voting-for-NRIs

ఎన్నారైలకు పరోక్ష ఓటింగ్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 9: సర్వీస్‌ ఓటర్ల తరహాలోనే ప్రవాస భారతీయులకు పరోక్ష ఓటింగ్‌ సదుపాయం కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును లోక్‌సభ గురువారం ఆమోదించింది. ప్రజాప్రాతినిధ్య(సవరణ) బిల్లు-2017ను ప్రవేశపెడుతూ.. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు ప్రవాసులకు ఇది ఉపయోగపడుతుందని న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. ఈ బిల్లు అమలులోకి వస్తే 3.10 కోట్ల మంది ప్రవాస భారతీయులు రానున్న ఎన్నికల్లో కీలకపాత్ర పోషించనుండటం గమనార్హం.