Indigo-huge-discount-offer

రూ.1,212కే ఇండిగో విమాన టికెట్‌

ముంబై: చౌక విమానయాన సేవల సంస్థ ఇండిగో భారీ డిస్కౌంట్‌ ఆఫర్‌ను ప్రకటించింది. కనిష్ఠంగా రూ.1,212కే టిక్కెట్‌ ఆఫర్‌ చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. తమ నెట్‌వర్క్‌లోని అన్ని మార్గాల్లో (విదేశీ రూట్లతో సహా) మొత్తం 12 లక్షల సీట్లను ఈ ఆఫర్‌లో అందుబాటులోకి తెచ్చినట్లు ఇండిగో వెల్లడించింది. మంగళవారం ప్రారంభమైన ఈ డిస్కౌంట్‌ ఆఫర్‌.. నాలుగురోజులపాటు కొనసాగనుంది. ఈ ఆఫర్‌లో బుక్‌ చేసుకున్న టికెట్ల ద్వారా ఈనెల 25 నుంచి వచ్చే ఏడాది మార్చి 30 మధ్యలో ప్రయాణించవచ్చు.