Indian-young-billionaire-kidnapped-

భారత సంతతి యువ బిలియనీర్ కిడ్నాప్

12-10-2018: భారత సంతతికి చెందిన టాంజానియన్, ఆఫ్రికా యువ బిలియనీర్ మహమ్మద్ డ్యూజీని సాయిధులు దార్ ఎస్ సలామ్‌లోని ఓ లగ్జరీ హోటల్‌ నుంచి కిడ్నాప్ చేశాడు. జిమ్‌కు డ్యూజీ వెళ్తుండగా ఈ కిడ్నాప్ జరిగినట్టు సీఎన్ఎన్ వార్తా కథనం పేర్కొంది. సాయిధులు కారులో హోటల్‌కు వచ్చారని, డ్యూజీని తీసుకువెళ్లే ముందు గాలిలోకి కాల్పులు జరిపారని రీజినల్ పోలీస్ కమిషనర్ లజారో మాంబొసాసో తెలిపారు. కిడ్నాప్ జరిగిన సమయంలో విధి నిర్వహణలో ఉన్న హోటల్ సిబ్బందిని ప్రశ్నించి వివరాలు రాబడుతున్నట్టు చెప్పారు. కిడ్నాపర్లు విదేశీయులని, గేట్ల గుండా జిమ్‌లోకి అడుగు పెట్టారని తెలుస్తోంది. డ్యూజీని కిడ్నాప్ చేయడానికి కారణం ఏమిటనేది ఇంకా తెలియలేదు.