indian-restaurent-closed-in-UAE

యూఏఈలోని ఇండియన్ రెస్టారెంట్‌ మూసివేత.. కారణం ఇదే

అబుదాబి: యూఏఈలోని అబుదాబి నగరం అల్ ఖలీదియా వీధిలో ఉన్న భారతీయ ప్రముఖ రెస్టారెంట్  ‘అంజప్పర్ చెట్టినాడ్‌’ను మూసివేశారు. హెల్త్ అండ్ సేఫ్టీ కోడ్‌ను పదేపదే ఉల్లంఘిస్తున్నారనే కారణంగా రెస్టారెంట్‌ను మూసివేస్తున్నామని అబుదాబి ఫూడ్ కంట్రోల్ అథారిటీ ఆదేశాలు జారీ చేసింది. ఎప్పటిలాగే తనిఖీలు నిర్వహిస్తుండగా రెస్టారెంట్‌ యాజమాన్యం నిబంధనలను ఉల్లంఘింస్తోందని నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. వినియోగదారులు ఫిర్యాదులు చేసినా తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో రెస్టారెంట్ యాజమాన్యం విఫలమవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నగరంలో కొనసాగుతున్న రెస్టారెంట్ల గురించి తమకు సమాచారం అందించాలని ఈ సందర్భంగా అధికారులు కోరారు. అబుదాబి గవర్నమెంట్ కంటాక్ట్ సెంటర్ నంబర్ 800555కు సమాచారం అందించాలని తెలిపారు.