:: Welcome to NRI - Article ::

లండన్‌లోని భారతీయ ప్రముఖ రెస్టారెంటు మూసివేత

లండన్: లిసెస్టర్‌‌లోని భారతీయ ప్రముఖ రెస్టారెంట్ ‘సాండ్స్ గ్లెన్‌ఫీల్డ్’ను ఆరోగ్యశాఖా అధికారులు మూసివేశారు. రెస్టారెంటుపై కొందరు వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదుపై ఆరోగ్య పర్యవేక్షక శాఖా అధికారులు తనిఖీ నిర్వహించారు. వంటగదిలోని ఆహారపదార్థాలు, ఆహారాన్ని నిలువచేసే ఫ్రీజులలో బొద్దింకలు ఉండడాన్ని గుర్తించారు. రెస్టారెంటును అధికారికంగా మూసివేస్తున్నాని అధికారులు ప్రకటించారు. దీంతో ఖంగుతిన్న రెస్టారెంట్ యాజమాన్యం మరోసారి తప్పుచేయబోమని, రెస్టారెంటును మళ్లీ తెరిచేందుకు అవకాశం కల్పించాలని  జిల్లా కోర్టులో ఓ అప్పీలు చేసింది. ఫిబ్రవరి 8న ఈ అప్పీలును పరిశీలించిన న్యాయస్థానం నాణ్యమైన, పరిశుభ్రమైన, వినియోగదారుల ఆరోగ్యానికి హానికలిగించని ఆహారపదార్థాలను అందిస్తామని ఆరోగ్యశాఖా అధికారులకు తెలియజేయాలని, అప్పుడు మాత్రమే రెస్టారెంటును పున:ప్రారంభించేందుకు అవకాశం కల్పిస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది. స్పందించిన రెస్టారెంట్ యజామాన్యం ‘విలువైన వినియోగదారులకు పరిశుభ్రమైన ఆహారపదార్థాలను అందిస్తాం’ అని ఓ నోటీసుని రెస్టారెంటు ముందు అంటించింది. నాణ్యత కోసం తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది.