Indian-passport-79th-most-powerful

భారత్‌ది 79వ శక్తిమంతమైన పాస్‌పోర్టు

న్యూఢిల్లీ, జనవరి 10: ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టుల్లో భారత పాస్‌పోర్టు 79వ స్థానంలో నిలిచింది. ఈ పాస్‌పోర్టు ఉంటే ముందస్తు వీసా లేకుండా 61 దేశాలకు వెళ్లిరావచ్చని హెన్లీ అండ్‌ పార్టనర్స్‌ పాస్‌పోర్ట్‌ ఇండెక్స్‌ పేర్కొంది. ఈ జాబితాలో జపాన్‌ తొలి స్థానంలో నిలిచింది. ఆ దేశ పాస్‌పోర్టు ఉన్న వ్యక్తి ముందస్తు వీసా లేకుండా 190 దేశాల్లో పర్యటించవచ్చు. ఈ జాబితాలో పాకిస్థాన్‌ పాస్‌పోర్టు 102వ స్థానాన్ని పొందింది.