indian-origin-person-arrested-in-america

భారత సంతతి వలస హక్కుల నేత అరెస్టు

వాషింగ్టన్‌, జనవరి 12: అమెరికాలో వలసదారుల హక్కులకోసం పోరాటం చేస్తున్న భారత సంతతికి చెందిన రవి రగ్బీర్‌ను అక్కడి ఇమ్మిగ్రేషన్‌, కస్టమ్స్‌ అధికారులు అరెస్టు చేశారు. అతను స్థానికుల పాలిట ఇబ్బందికరమైన వ్యక్తిగా మారాడనే కారణంతో భారత్‌కు తిప్పిపంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. 1991లో పర్యాటక వీసాపై అమెరికాకు వెళ్లిన రగ్బీర్‌ 1994 నుంచి శాశ్వత నివాస అర్హత సాధించారు. వలసదారుల హక్కుల కోసం చేస్తున్న పోరాడుతూ పలు అవార్డులు అందుకున్నారు.