:: Welcome to NRI - Article ::

నిషిద్ధ ప్రదేశంలో సిగరెట్..తప్పని చెప్పినందుకు ఇలా చేశాడు..

సింగపూర్: సింగపూర్‌లో నివాసముంటున్న రామసామీ సూగుమార్ అనే 59 ఏళ్ల భారతీయ వ్యక్తి నేరానికి పాల్పడ్డాడు. నిషిద్ధ ప్రదేశంలో సిగరెట్ తాగాడు. అంతేకాకుండా అతడి వద్ద ఓ బీర్ బాటిల్ కూడా ఉంది. ఈ విషయాన్ని గమనించిన ఇద్దరు వ్యక్తులు.. ఇది నిషిద్ధ ప్రదేశమంటూ, ఇక్కడ ధూమపానం చేయకూడదంటూ చెప్పడంతో వివాదం చెలరేగింది. సలహాఇచ్చిన వ్యక్తుల్లో ఒకరి చెంపమీద రామసామీ కొట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ నిందితుడు ఏమాత్రం భయపడలేదు. పోలీసులను కూడా బెదిరించాడు. వారితో గొడవకు దిగాడు. దీంతో నిందితుడిపై పోలీసులు కేసునమోదు చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం నిందితుడికి 6 నెలల జైలు శిక్షవిధించింది. ఇదిలావుండగా.. నిషిద్ధ ప్రదేశం అని సూచించే బోర్డు లేకపోవడంతోనే నిందితుడు ధూమపానం చేశాడని, అతడి తప్పేమీ లేదని నిందితుడి తరపున్యాయవాది వాదించినా న్యాయమూర్తి కొట్టిపారేశారు. నిందితుడు శిక్ష అనుభవించాల్సిందేనని తీర్పునిచ్చారు.

 

Loading...