indian-men-arrested-in-dubai-

28 ఏళ్ల మహిళ స్నానం చేస్తుండగా..

దుబాయ్: కంపెనీ అకామిడేషన్‌లో ఆఫీసు అసిస్టెంట్‌గా పనిచేస్తోన్న భారతీయ యువకుడు 28 ఏళ్ల ఫిలిఫైన్ మహిళ స్నానం చేస్తుండగా బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా అమర్చి వీడియో తీశాడు. ఇప్పటివరకు అతడు అలా ఇద్దరు, ముగ్గురు మహిళలు స్నానం చేస్తుండగా వీడియో తీసినట్లు యువకుడి స్నేహితులు చెప్పారు. అసలు విషయం ఎలా బయటపడిందంటే.. ఫిలిఫైన్ మహిళ స్నానం చేస్తుండగా పైపు పక్కన ఉన్న ఏదో అనుమానస్పద వస్తువు కనిపించింది. అదెంటాని ఆరా తీయగా సీక్రెట్ కెమెరా అని తేలడంతో కంపెనీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించారు. అకామిడేషన్‌లోని సీసీ కెమెరా రికార్డులను పరిశీలించగా కంపెనీ అకామీడేషన్‌లో సహయకుడిగా పనిచేస్తున్న భారతీయ యువకుడే ఆ కెమెరా అమర్చినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతడికి మూడు నెలల పాటు జైలు శిక్ష విధించింది.