:: Welcome to NRI - Article ::

భారత్‌దే పైచేయి.. తర్వాతే చైనా, పాక్

దుబాయి: టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న కొద్దీ.. భారతీయులు సరికొత్త ప్రాంతాలకు వలసలు వెళ్లడం కూడా పెరుగుతున్నాయి. ప్రపంచంలో భారతీయులు లేని దేశం లేదంటే అతిశయోక్తి కాదేమో. అమెరికా అయినా గల్ఫ్ దేశమయినా, చైనా అయినా స్విడ్జర్లాండ్ అయినా.. ఎక్కడయినా సరే భారతీయులు, అందులోనూ మన తెలుగువారు ఉండని ప్రాంతం ఉండదు. అందుకే ఇప్పుడు భారత్ ఓ అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. ప్రపంచంలో ఎక్కువగా ఏ దేశానికి విదేశాల నుంచి డబ్బు పంపిస్తున్నారనే విషయమై యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్‌మెంట్ ఓ సర్వే చేసింది. ఈ సర్వేలో ప్రపంచ నలుమూలల నుంచి ప్రవాసుల నుంచి అధికమొత్తంలో డబ్బును తన ఖాతాలో వేసుకుంటున్న దేశంగా భారత్ మొట్టమొదటి స్థానంలో నిలిచింది. 62.7 బిలియన్ (దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు) డాలర్ల మొత్తాన్ని ప్రవాసులు తమ వారికి పంపిస్తున్నారు. ఆ తర్వాతి స్థానంలో చైనా నిలిచింది. మొత్తం 61 బిలియన్ డాలర్లను వివిధ దేశాల్లో ఉన్న చైనీయులు.. తమ స్వదేశానికి పంపిస్తున్నారు. 29.9 బిలియన్ డాలర్లతో ఫిలిప్పీన్స్, 28.5 బిలియన్ డాలర్లతో మెక్సికన్లు, 19.8 బిలియన్ డాలర్లతో పాకిస్తాన్ మొదటి అయిదు స్థానాల్లో నిలిచాయి.