india-requests-uae

యూఏఈ ప్రభుత్వానికి భారత విజ్ఞప్తి ఇది

న్యూఢిల్లీ/అబుదాబి: పర్యాటక వీసాపై వచ్చిన భారతీయ మహిళలకు వర్క్ వీసా జారీ చేయవద్దని యూఏఈ ప్రభుత్వాన్ని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కోరారు. ఏజెంట్ల చేతుల్లో మోసపోయి యూఏఈ వచ్చిన అనేకమంది భారతీయ మహిళలు చిక్కుల్లో పడుతున్నారని, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలోని ‘ఇండియన్ సోషల్ అండ్ కల్చరల్ సెంటర్’(ఐఎస్‌సీ) జరిగిన కార్యక్రమంలో సుష్మా మాట్లాడారు. ఏజెంట్ల మాటలు నమ్మి అనేకమంది మహిళలు యూఏఈ వెళ్తున్నారని, అనంతరం వర్క్ వీసా తీసుకుని ఇబ్బందులు, హింసలకు గురవుతున్నారని ఆమె వెల్లడించారు. ఏజెంట్ల చేతుల్లో మోసపోతున్న మహిళలను రక్షించేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకోవాలని ఆమె కోరారు. అక్రమ మార్గాల ద్వారా యూఏఈ వెళ్లిన 1,33,000 మంది మహిళలను రక్షించామని ఆమె తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ హయాంలో భారత్, యూఏఈ బంధాలు ఊహించని బలపడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో యూఏఈలోని భారత అంబాసీడర్ నవ్‌దీప్ సింగ్ సూరి, ఐఎస్‌సీ చైర్మన్ యూసుఫ్ అలీ, తదితరులు పాల్గొన్నారు.