India-pips-US-to-become-Second-largest

అమెరికాను దాటేసిన భారత్‌

స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో అమెరికాను దాటేసినభారత్‌


న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల్లో అమెరికాను భారత్‌ అధిగమించింది. ఈ ఏడాది జూలై-సెప్టెంబరు త్రైమాసికం (క్యు2)లో అమెరికాను వెనక్కు నెట్టి ప్రపంచంలో రెండో అతిపెద్ద మార్కెట్‌గా అవతరించింది. ఈ త్రైమాసికంలో భారత్‌లో 4.04 కోట్ల ఫోన్ల అమ్మకాలు జరిగాయని పరిశోధనా సంస్థ కెనాలిస్‌ నివేదిక పేర్కొంది. అగ్రస్థానంలో ఉన్న చైనాలో 10.06 కోట్ల ఫోన్లు అమ్ముడయ్యాయి. అమెరికాలో మాత్రం 4 కోట్ల ఫోన్ల విక్రయాలే జరిగినట్టు నివేదిక పేర్కొంది. కాగా స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. సమీక్షా త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు 7.2 శాతం తగ్గి 34.89 కోట్లకు చేరాయి.