:: Welcome to NRI - Article ::

భారత్‌కు మాత్రమే ఆ సత్తా ఉంది:అమెరికా

వాషింగ్టన్: "భారత్ మాత్రమే రాబోయే విపత్తును తప్పించగలదు. ఆ సత్తా భారత్‌కు ఉంది. భారత్ గొంతు చాలా పెద్దది. ఏ విషయానైన సమూలంగా వివరించగలదు. అర్థం చేయించగలదు" అమెరికా ఫసిపిక్ అడ్మిరల్ కమాండర్ హరీ హరిస్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ మాత్రమే ఉత్తరకొరియాను నిలువరించగలదని, సమస్యను అర్థం చేయించగలదని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్ చెబితే ఉత్తరకొరియా వింటుందని అణుదాడులు ఆపే అస్కారం ఉందని హరీ అభిప్రాయపడ్డారు.

రోజురోజుకి అమెరికా, ఉత్తరకొరియాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయని, వాటిని రెండు దేశాల అధ్యక్షులు మరింత పెంచేలా మాటలతూటాలు  పేల్చుకుంటూ ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తున్నారన్నారు. ఈ సమయంలో భారత్‌లాంటి దేశం కలుగజేసుకోవాలని రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించాలని ఆయన కోరుతున్నారు. అయితే 2017 ఆరంభంలోనే ఉత్తరకొరియాతో ద్వైపాక్షిక సంబంధాలను భారత్ రద్దు చేసుకుందని ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ చర్యను సమర్థించారని హరీ గుర్తుచేశారు. 

Loading...