:: Welcome to NRI - Article ::

ట్రంప్‌కు ఫోన్ చేసిన చైనా అధ్యక్షుడు

వాషింగ్టన్/చైనా: అమెరికా, ఉత్తరకొరియా మధ్య నెలకొన్న ఉద్రిక్తకర పరిస్థితులతో కొరియన్ ద్వీపకల్పంలో ఆందోళనలు పెరుగుతుండడంపై డ్రాగన్ కంట్రీ చైనా స్పందించింది. ఈ ఆందోళనకర పరిస్థితులపై మాట్లాడేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఫోన్ చేశారు. ఉద్రిక్తకర వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని, పరిస్థితులు మరింత దిగజారే అవకాశం ఉందని డొనాల్డ్ ట్రంప్‌కు జిన్‌పింగ్ హితవుపలికారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య చర్చల ద్వారా మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుందని జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు. ఆవేశంగా మాట్లాడడం వల్ల సమస్య మరింత జఠిలమవుతుందని, ఉత్తరకొరియాను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దంటూ ఆయన ట్రంప్‌కు సూచించారు. ఉత్తరకొరియాపై చర్య తీసుకోవడానికి భద్రతాదళాలు సిద్ధంగా ఉన్నాయని కిమ్‌ను ట్రంప్ హెచ్చరించిన అనంతరం స్పందించిన చైనా ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.

 

Loading...