:: Welcome to NRI - Article ::

"అమెరికన్‌లను తలఎత్తుకునేలా చేస్తా"

వాషింగ్టన్: అమెరికాను ఉన్నతంగా తీర్చిదిద్దడమే అధ్యక్షుడు ట్రంప్ లక్ష్యమని వైట్‌హౌజ్ మీడియా ప్రతినిధి హెలెన్ ఫెర్రె చెప్సారు. ఈ నెల 23 ఆదివారం నుంచి వచ్చే ఆదివారం వరకు మేడిన్ అమెరికా సంబరాలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. అమెరికా వ్యాప్తంగా 50 రాష్ట్రాల్లో ఈ వేడుకలు జరుగుతాయని చెప్పారు. అమెరికన్లు తయారుచేసిన వస్తువులను ఇందులో ప్రదర్శిస్తారని తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్, పదవీబాధ్యతలు చేపట్టిననాటి నుంచి అన్ని అమెరికా వస్తువులనే ఉపయోగిస్తున్నారని ఇది ఆయన నిబద్ధతకు నిదర్శనమన్నారు. మళ్లీ అమెరికా ప్రపంచదేశాల ముందు గర్వంగా తలఎత్తుకునేలా ట్రంప్ చేస్తున్న పనులు ఉన్నాయని చెప్పారు.

చాలా మంది అధ్యక్షుల కాకుండా ట్రంప్, అమెరికన్ శ్రామికశక్తిని గుర్తించారని వారికి మంచి ఉపాధి మార్గాలు కల్పించేందుకే వలసలు లేకుండా చూస్తున్నారని తెలిపారు. అయితే కొంతమంది దీనిపై విషప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. ట్రంప్ కూడా వర్జినీయాలో పర్యటిస్తూ ఇవే మాటలు చెప్పారని అమెరికన్ శ్రామికశక్తికి మంచిరోజులు వచ్చాయని తాను వారి అభివృద్ధి కోసమే అమెరికన్ వస్తువులను ఉపయోగిస్తున్నట్లు చెప్పాడన్నారు. అందరూ దీన్ని అనుసరించాలని అందరికంటే ముందు అధ్యక్షుడు దాన్ని ఆచరించి చూపారని హెలెన్ చెప్పారు. 

Loading...