I-gave-up-my-job-and-home-to-lead-life-like-a-woman,-Miss-Tansgender-Aria

‘అబ్బాయిగానే పెరిగా.. కానీ ఓ అమ్మాయిలా బతికేందుకు జాబ్‌కు రిజైన్ చేసి..’

పెర్త్‌షైర్: టెక్నాలజీతో పాటుగా మనుషులు..వారి మనస్తత్వాలు, వ్యక్తిత్వాలు కూడా మారుతున్నాయి. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఇద్దరు అమ్మాయిలు లేదా ఇద్దరు అబ్బాయిలు పెళ్లిళ్లు చేసుకోవడం సర్వసాధారణ విషయం. అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన, మారుతున్న వారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అలానే అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన థామస్..కాదు కాదు ఆరియా కథ గురించి మాట్లాడుకుందాం. స్కాట్లండ్‌లోని పెర్త్ షైర్‌కు చెందిన థామస్ అబ్బాయిగా పుట్టి కొంతకాలం పాటు అలానే పెరిగాడు. కానీ అమ్మాయిలా మారదాం అని నిశ్చయించుకున్న నాటి నుంచి థామస్‌కు కష్టాలు ఎదురయ్యాయి. ఆరియా తన స్నేహితురాలి సహాయంతో 2015లో లింగమార్పిడి పరీక్ష చేసుకుంది. ఆ తర్వాత ఆరియాగా నామకరణం చేసుకుంది. ప్రస్తుతం ఆరియాను చూసిన ఏ ఒక్కరూ ఆమె ఇతివరకు అబ్బాయంటే నమ్మరు. ఆ విధంగా ఆరియా మార్పు చెందింది. 2017 నవంబరు వరకు కూడా గే లానే బతికిన ఆరియా..తాను కోరుకున్న జీవితం ఇది కాదనుకుని భర్తను, ఇంటిని, ఉద్యోగాన్ని వదిలేసి తన కలల ప్రపంచానికి ఆరియాగా వెళ్లిపోయింది. ఇంటినుంచి వచ్చేసిన ఆర్యకు తన స్నేహితురాలు అండగా నిలిచింది. డబ్బులు వచ్చే మార్గమేమి లేకపోయినా..తన స్నేహితురాలి ద్వారా పూట గడుపుకుంటూనే మిస్ ట్రాన్స్‌జెండర్ యూకే 2018 కిరీటాన్ని సొంతం చేసుకుంది.