Hyderabad-to-Dubai-special-Tour-by-IRCTC

హైదరాబాద్‌ టు దుబాయ్‌ విదేశీ యాత్ర: ఐఆర్‌సీటీసీ

హైదరాబాద్, అడ్డగుట్ట :కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌కి విదేశీయాత్ర సౌకర్యం కల్పిస్తున్నా మని ఐఆర్‌సీటీసీ జనరల్‌ మేనేజర్‌ ఎన్‌.సంజీ వయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి దుబాయ్‌కి నవంబర్‌ 4 నుంచి 7 వరకు మూడు రాత్రులు, నాలుగు పగళ్లు విదేశీ యాత్రకు తీసుకెళ్లను న్నట్టు చెప్పారు. 
 
చూపించే ప్రదేశాలు
దుబాయ్‌లోని సిటీటూర్‌, కింగ్స్‌ ప్యాలెస్‌, డౌక్రూన్‌, డెసర్ట్‌ సఫారి, గ్లోబల్‌ విలేజ్‌, బుర్ట్‌ ఆల్‌ అరబ్‌ 7 స్టార్‌ హోటల్‌, ఖలీఫా, దుబాయ్‌ మాల్‌, అబుదాబీ, (1 పగలు) అబుదాబీ గ్రాండ్‌, మాస్క్‌, హెరిటేజ్‌ విలేజ్‌తో పాటు ఇతర స్థలాలను చూపిస్తారు. 
 
చార్జీలు ఇలా ఉన్నాయి 
హైదరాబాద్‌-దుబాయ్‌, దుబాయ్‌-హైదరా బాద్‌, నాలుగు రోజులకు ఒక్కొక్కరికి రూ.59,814 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం 040-27702407, 04027800580, 97013 60647, (సికింద్రాబాద్‌), 040-23400606 (బేగం పేట్‌), 0866-2572280- 9701360620 (విజయ వాడ), 08772222010, 9701360689, 9701376620 (తిరుపతి)లలో సంప్రదించాలని ఐఆర్‌సీటీసీ జీఎం సూచించారు.