Husband-Last-ride-by-wife-due-to-son-in-Dubai

దుబాయిలో కొడుకు.. భర్తకు భార్య అంత్యక్రియలు

ఎర్రముక్కాం(సోంపేట రూరల్‌), జూలై 11: కడుపున పుట్టిన కుమారులు ఉన్నా అంత్యక్రియలకు హాజరుకాలేని పరిస్థితిలో భార్యే తన జీవిత భాగస్వామికి దహన సంస్కారాలు నిర్వహించి రుణం తీర్చుకుంది. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం ఎర్రముక్కాం గ్రామానికి చెందిన బైపల్లి కొర్లయ్య (61) గుండెపోటుతో బుధవారం ఉదయం మృతి చెందాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్దకుమారుడు రమేష్‌ మహారాష్ట్రలోని షోలాపూర్‌లో, చిన్నకుమారుడు ప్రసాద్‌ దుబాయిలో ఉంటున్నారు. కుమార్తె వివాహమై భిలాయ్‌లో నివసిస్తోంది. కొర్లయ్య మృతిచెందిన విషయం తెలియజేసినా.. ముగ్గురు పిల్లలూ సాయంత్రానికి ఎర్రముక్కాం చేరుకోలేని దుస్థితి. ఈ నేపథ్యంలో పుట్టెడు దుఃఖంతో భార్య పేరమ్మ.. కొర్లయ్య భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించింది.