Hurricane-Michael-tears-into-Florida

బీభత్సం సృష్టిస్తున్న హారికేన్ ‘మైకేల్’

ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడాపై కేటగిరి 4 తీవ్రత గల ‘హారికేన్ మైకేల్’ విరుచుకుపడుతోంది. బుధవారం తీరం దాటడడంతో భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. భారీ వర్షపాతం నమోదవుతోంది. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. గాలుల ధాటికి అనేక ఇళ్ల పైకప్పుడు లేచిపోతున్నాయి. వర్షాల ధాటికి అంతా వరదలమయమైంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. అనేక ఇళ్లు నీటిలో మునిగాయి. విద్యుత్ సరఫరాకు తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. లక్షలాది మంది అంధకారంలో చిక్కుకుని నానాఅవస్థలు ఎదుర్కొంటున్నారు. ఫ్లోరిడా ఉత్తర తీర ప్రాంతం దాదాపు దశాబ్దం తర్వాత ఈ స్థాయి తీవ్రత గల తుఫాన్‌ను ఎదుర్కొంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఫ్లోరిడాలోని పనామా సిటీ బీచ్‌పై విరుచుకుపడింది. అనేక చెట్లు కూలిపోయాయి. పరిస్థితులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశిస్తున్నారు. ‘హారికేన్ మైకేల్’ కారణంగా ఇప్పటివరకూ ఒకరు మృతిచెందినట్లుగా అధికారులు వెల్లడించారు. హారికేన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉందని ప్రజా సమాచార అధికారి ఒలివియా స్మిత్ వెల్లడించారు.