highest-temprature-recorded-for-this-year-

ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

దుబాయ్: గల్ఫ్ దేశాలను వేసవి తాపం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జనాలు ఇబ్బందులకు గురవుతున్నారు. యూఏఈలోని అబుదాబికి  సమీపంలోని మెజిర ప్రాంతంలో ఈ సంవత్సరంలోనే అత్యధిక, రికార్డ్‌స్థాయి ఉష్ణగ్రత నమోదైంది. 51.1 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత బుధవారం రికార్డ్ అయింది. సైహు అల్ సలేం, అల్ షవామెక్, అల్ అజ్బాన్ ప్రాంతాలలో 50 డిగ్రీల సెల్సియస్‌పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ(ఎన్‌సీఎం) అధికారులు ప్రకటించారు. రాగల రోజుల్లో ఉష్ణోగ్రతలు 46 - 49 సెల్సియస్ డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. తీర ప్రాంతాలలో ఉష్ణగ్రతలు ఎక్కువగా ఉండొచ్చన్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నీళ్లు అధికంగా తాగాలని, ఎండలో తిగగకూడదని, వ్యాయామాలు చేయడం తగ్గించడంతోపాటు పలు ముఖ్యమైన సూచనలు చేశారు.