HEAVY-RAINS-HIT-

బలమైన గాలులు వీయడంతో..

బ్రిటన్: ఎటూ చూసిన రోడ్లపై విరిగిపడిన చెట్లు, చెదిరిన హోర్డింగులతో లండన్ నగరంలో ట్రాఫిక్ మొత్తం నిలిచిపోయింది. దానికితోడు రైలు పట్టాలపై కూడా చెట్లు విరిగిపడటంతో రైళ్లను కూడా రైల్వే శాఖ నిలిపేసింది. ప్రజా రవాణా మొత్తం స్తంభించిందని అధికారులు తెలిపారు. మరోవైపు పెద్ద ఎత్తున అలలు సముద్ర తీరంలో ఎగసిపడ్డాయని వారు చెప్పారు. సముద్ర తీరంవైపు ఎవ్వరూ వెళ్లొద్దని హెచ్చరికలు కూడా జారీ చేశారు.

ఇదిలావుండగా రోడ్లు, రైళ్లు, సముద్ర మార్గాలే కాదు విమానాలకు కూడా దెబ్బ తప్పలేదని అధికారులు చెప్పారు. బలంగా గాలులు వీస్తుండటంతోనే ఈ ముప్పు ఏర్పడిందని వారు చెబుతున్నారు. లీడ్స్ బ్రాడ్‌ఫోర్డ్ ఎయిర్‌పోర్టులో రన్‌వేపై ల్యాండవాల్సిన విమానం చాలా సేపటికీ అతి కష్టం మీద పైలెట్ ల్యాండ్ చేశాడని అధికారులు తెలిపారు. బలమైన గాలులు వీచినందువల్లనే ఈ పరిస్థితులు తలెత్తాయన్నారు. అలాగే గాలులతోపాటు భారీ వర్షం కూడా కురిసిందని అధికారులు తెలిపారు.