heavy-rain-hits-

రికార్డు స్థాయిలో కురిసిన భారీ వర్షం..

హవాయి: రికార్డు స్థాయిలో 71 సెంటిమీటర్ల వర్షం కురిసింది. చాలా ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగిపోయాయి. వందల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. కొంతమందిని మాత్రమే అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షం కురియడంతో కొన్ని ప్రాంతాలకు చేరుకోవడం కష్టంగా మారిందని అధికారులు తెలిపారు. వర్షం సద్దుమణిగిన తర్వాత కొన్ని ప్రాంతాలకు హెలికాప్టర్‌లను పంపి నిర్వాసితులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించామని వారు అన్నారు.

కొంతమంది నిర్వాసితులు మాత్రం వారి సొంత పడవల ద్వారా ప్రభుత్వం కల్పించిన ఆశ్రయాలకు చేరుకున్నారన్నారు. రోడ్లు, ఇళ్లల్లో ఎటు చూసిన నీటితో నిండిపోయాయని అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో మనుషులు మునిగేంత లోతులో నీరు చేరిందన్నారు. కొన్ని ఊళ్ల ఆనవాళ్లు కనిపించడం లేదని వారు తెలిపారు.