:: Welcome to NRI - Article ::

గువామ్ ప్రజలకు హెచ్చరికలు జారీ..

వాషింగ్టన్: ఉత్తరకొరియా అమెరికా ద్వీప ప్రాంతం గువామ్‌పై దాడి చేయడానికి సర్వం సిద్ధం చేసుకుంటోంది. నాలుగు బాలిస్టిక్ మిస్సైల్‌లను ఫసిపిక్ మహసముద్రంలో జారవిడిచేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిందని అమెరికా ఇంటలిజెన్స్ చెబుతోంది. గతవారం ఉత్తరకొరియా ఆర్మీ జనరల్ కిమ్ రాక్ గామ్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారని తెలిపింది. నాలుగు 'హవాసాంగ్-12' మధ్యంతర బాలిస్టిక్ రాకెట్స్ సిద్ధం చేసినట్లు కిమ్ పేర్కొన్నారంది.

అంతేకాదు అమెరికా తమ దాడిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ రాక్ సవాలు విసిరారని గుర్తుచేసింది. గువామ్ ప్రజలకు అణుదాడి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలిపామని గువామ్ జాయింట్ ఇంటలిజెన్స్ శనివారం కొన్ని సూచనలు చేసింది. ఆకాశంలో మెరుపులు చిమ్ముతూ కాంతి కనపడితే ఎట్టిపరిస్థితుల్లోనూ పైకి చూడొద్దని చెప్పింది. వెంటనే నేలపై ఎక్కడుంటే అక్కడే పడుకోవాలని ప్రజలకు సూచిస్తోంది. అవసరమైతే బొరియాలు ఏర్పాటు చేసుకోవాలంటోంది. అలాగే తలకు రక్షణగా ఏదైనా వస్త్రం లాంటిది చుట్టుకోవాలని చెప్పింది. కాంతిపుజం కనిపించిన 30 సెకన్లల్లోనే భూమిని తాకుతుందని హెచ్చరించింది.

Loading...